తెలంగాణ మాజీమంత్రి ఈటల రాజేందర్ భాజపాలో చేరుతున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన దిల్లీకి బయల్దేరి వెళ్లారు. రేపు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఈటల కలవనున్నారు. ప్రస్తుతం కరీంనగర్ పర్యటనలో ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... రేపు ఉదయం దిల్లీ వెళ్లనున్నారు.
Etela Rajender: హస్తినకు ఈటల.. భాజపాలో చేరిక జూన్ 2 తర్వాతే..! - ఈటల రాజేందర్ వార్తలు
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ దిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన భాజపాలో చేరుతున్నారనే ఊహాగానాల మధ్య హస్తినకు పయనమయ్యారు.
etala rajendar
ఈటల రాజేందర్‌ను నడ్డాకు బండి సంజయ్ పరిచయం చేయనున్నారు. అనంతరం పలువురు భాజపా సీనియర్ నేతలను కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. రేపు ఈటల భాజపాలో చేరే అవకాశం లేదని.. జూన్ 2న లేదా ఆ తరువాత చేరుతారని భాజపా నేతలు చెబుతున్నారు.