కేంద్ర బయో టెక్నాలజీ విభాగం(డీబీటీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ(ఎన్‌ఐఏబీ), హెచ్‌సీయూ సంయుక్తంగా బీఎస్‌ఎల్-3 ల్యాబ్‌ను నెలకొల్పాయి. సీసీఎంబీలో ఉన్నదాని కన్నా మిన్నగా.. సుమారు రూ.12 కోట్ల వ్యయంతో 3వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనికి రూపమిచ్చారు. ఏడేళ్ల కిందటే ల్యాబ్ నిర్మాణానికి అప్పటి ఉపకులపతి రామకృష్ణ రామస్వామి శంకుస్థాపన చేసినా.. వివిధ కారణాలతో పనులు ముందుకు సాగలేదు. తర్వాత మాజీ ఉపకులపతి ప్రొ.పొదిలె అప్పారావు, వర్సిటీ లైఫ్‌సైన్సెస్ డీన్ ప్రొ.దయానంద సిద్దావత్తం, బయోకెమిస్ట్రీ ఆచార్యులు ప్రొ.శర్మిష్ఠ బెనర్జీ నిరంతర కృషితో ఇప్పటికిది సేవలందించేందుకు సిద్ధమైంది.
పూర్తి భద్రత ప్రమాణాలతో..
ప్రమాదకర వైరస్, బ్యాక్టీరియా, ప్రొటోజువా ఇతర సూక్ష్మజీవులపై ప్రయోగాలు అన్ని ప్రయోగశాలల్లో సాధ్యపడదు. ప్రభుత్వాలూ అందుకు అంగీకరించవు. అనుకోకుండా వైరస్ లీకైతే మానవాళికి పెనుముప్పుగా మారుతుంది. కేవలం బీఎస్‌ఎల్-3 సదుపాయాలున్న ప్రయోగశాలల్లోనే ప్రయోగాలకు అనుమతి ఉంటుంది. ఇకపై హెచ్‌సీయూలో ఆ తరహా ప్రయోగాలకు సానుకూలత లభించనుంది. పూర్తి భద్రత ప్రమాణాలతో దీన్ని తీర్చిదిద్దారు. స్వయంచాలిత(ఆటోమేటిక్) విధానంలో ఇది పనిచేయనుంది.
వ్యాక్సిన్ టెస్టింగ్‌కు కీలకం..
ప్రస్తుతం హైదరాబాద్ వ్యాక్సిన్ ఉత్పత్తికి కీలక కేంద్రంగా మారింది. వ్యాక్సిన్ల టెస్టింగ్(ఛాలెంజింగ్ ప్రయోగాల)కు నగరంలో సదుపాయాలు లేవు. ఇందుకోసం పుణె లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్‌సీయూలో సిద్ధం చేస్తున్న ఏబీఎస్‌ఎల్-3 ల్యాబ్ అలాంటి అవసరాలకు అక్కరకొస్తుందని ఆచార్యులు తెలిపారు.
ఎన్నో ప్రత్యేకతలు..