కరోనా వేళ తెలంగాణాలో నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అమ్మకందారులు అదును చూసి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనకు నిత్యం పదును పెడుతున్నారు. లాక్‌డౌన్ మొదట్లో వినియోగదారులు పెద్దఎత్తున రావడం వల్ల ధరలను 30 శాతం పెంచేసి అమ్ముకున్నారు. తర్వాత అమ్మకాలు తగ్గిన కారణంగా.. 20 శాతానికి పరిమితమయ్యారు.
20 శాతం ఎందుకు పెరిగాయి..?
కొత్త పంటలు రాలేదు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న పప్పులన్నీ పాతవే. ఆ 20 శాతం ధరలను ఎందుకు పెంచారో అర్థం కాని పరిస్థితి. లాక్‌డౌన్‌కు ముందు కిలో కందిపప్పు ప్యాకెట్‌పై ఉన్న ధరకు 10 శాతం రాయితీతో రూ. 85 నుంచి రూ.95 అమ్మగా.. లాక్‌డౌన్ తొలినాళ్లలో రూ. 110 నుంచి రూ. 120 వరకు అమ్మేశారు.
ఇప్పుడు కూడా ఇంతే ధరను కొనసాగిస్తున్నారు. ప్రస్తుత ధరల ప్రకారం కందిపప్పు కిలో రూ. 65- 70 వరకు మార్కెట్లో అందుబాటులో ఉండాలి. ఇదేమని అడిగితే మొదటి రకం అని కొన్ని సూపర్ బజార్ల నిర్వాహకులు చెబుతున్నారని పలువురు వినియోగ దారులు పేర్కొంటున్నారు.