ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Erthin MD Ravimohan తమ డైరెక్టర్‌కు రాజకీయ నేపథ్యం ఉన్న విషయం తెలియదన్న ఎర్తిన్‌ ఎండీ - ap latest updates

Erthin Managing Director Ravimohan దివాలా ప్రక్రియ ద్వారా ఇందూ ప్రాజెక్ట్స్‌ను సొంతం చేసుకుంటున్న ఎర్తిన్‌ ప్రాజెక్ట్స్‌లో ఇటీవల పెట్టుబడి పెట్టినవారి తరఫున ఈ ఏడాది ఏప్రిల్‌లో అయిదుగురు కంపెనీ డైరెక్టర్లుగా చేరారని, వారిలో ఒకరికి రాజకీయ సంబంధాలు ఉన్నాయనే విషయం తమకు తెలియదని ఎర్తిన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.రవిమోహన్‌ చెప్పారు. దివాలా ప్రక్రియను పూర్తిచేసేందుకు తాము చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు. మరోవైపు ఇందూ ప్రాజెక్ట్స్​పై ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి స్పందించారు. ఇందులో కుమారుడు పెట్టుబడులు మాత్రమే పెట్టారని వేలంతో తమకు సంబంధం లేదని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి తెలిపారు

Erthin MD Ravimohan
ఇందూ ప్రాజెక్ట్స్‌

By

Published : Aug 24, 2022, 7:32 AM IST

Erthin Managing Director Ravimohan హైదరాబాద్‌లో మంగళవారం విలేకరులతో ఎర్తిన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ.రవిమోహన్‌ మాట్లాడారు. తమది నికార్సయిన కంపెనీ అని, ఎలాంటి రాజకీయ ఆసక్తులు లేనిదని అన్నారు. అనంతపురం జిల్లాలో లేపాక్షి స్థానంలో ప్రపంచస్థాయి నాలెడ్జి సిటీ అభివృద్ధికి తాము ప్రణాళికలు రూపొందించామని వివరించారు. తమకు అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి నిధులు వచ్చే ప్రక్రియ ఎఫ్‌డీఐ నిబంధనలకు అనుగుణంగా జరుగుతోందని, ఈలోపు తాము స్థానిక పెట్టుబడిదారుల నుంచి రూ.55 కోట్లు సమీకరించామని వివరించారు. దివాలా ప్రక్రియను పూర్తిచేసేందుకు తాము చిత్తశుద్ధితో ఉన్నామని, అయితే ఇందూకు సంబంధించిన పాత డైరెక్టర్లు ఈ ప్రక్రియలో భాగమైన కొన్ని ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందూ ప్రాజెక్ట్స్‌కే చెందిన రెడ్‌ఫోర్ట్‌ అక్బర్‌ ప్రాపర్టీస్‌ ఆస్తుల అన్యాక్రాంతానికి పాల్పడుతున్న శ్యాంప్రసాదరెడ్డిపై తాము జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు.

నా కుమారుడు పెట్టుబడులు పెట్టారు.. వేలానికి మాకు సంబంధం లేదు

ఇందూ ప్రాజెక్ట్స్‌ భూములను నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) వేలం వేయగా ‘ఎర్తిన్‌’ ప్రాజెక్ట్స్‌ కంపెనీ, కె.రామచంద్రరావు ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ వారు కొన్నారని వైయస్‌ఆర్‌ జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి తెలిపారు. మంగళవారం కమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల క్రితం వేలంలో భూములను వేరే కంపెనీలు కొన్నాయని వివరించారు. ఇటీవల పెట్టుబడుల కోసం తన కుమారుడు నరేన్‌ రామానుజులరెడ్డిని (చింతకొమ్మదిన్నె మండల జడ్పీటీసీ సభ్యుడు) కంపెనీలు సంప్రదించాయని, దాంతో తన కుమారుడు, అతని స్నేహితులు పెట్టుబడులు పెట్టారని చెప్పారు. కంపెనీ దివాలా తీసినప్పుడు ఎన్‌సీఎల్‌టీ జోక్యం చేసుకుని ప్రైవేటు వ్యక్తులు, బ్యాంకులు నష్టపోకుండా వేలం నిర్వహించి అప్పులు కట్టే చర్య తీసుకున్నట్లు వివరించారు. తన కుమారుడు పెట్టుబడుల కోసమే డైరెక్టర్‌గా చేరారని చెప్పారు. ఎన్‌సీఎల్‌టీ అనేది ఓ న్యాయస్థానమని.. దీనిద్వారా వేసిన వేలంలో కొన్నారని పేర్కొన్నారు. ఈ వేలం ప్రక్రియకు, తమకు సంబంధం లేదని..పెట్టుబడులు మాత్రమే పెట్టామని వివరించారు. ఎన్‌సీఎల్‌టీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో లేనిదని తెలిపారు. ఈ వ్యవహారంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఏ మాత్రం సంబంధం లేదని, ఆయన చేసే వ్యాపారాలు తమకు చెప్పి చేయరని.. అలాగే తామూ ఆయనకు చెప్పి చేయడం లేదని చెప్పారు. గ్లోబల్‌ టెండరు ద్వారా జరిగిన వేలంలో భూములు కొన్నట్లు పేర్కొన్నారు. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌... రాజశేఖరరెడ్డి హయాం నుంచి నడుస్తున్న వ్యవహారమేనన్నారు. భూములివ్వకపోతే పెట్టుబడులు ఎలా వస్తాయన్న ఆయన.. సదుద్దేశంతోనే రాజశేఖరరెడ్డి, చంద్రబాబు పెట్టుబడిదారులకు భూములిచ్చారని చెప్పారు. లేపాక్షి భూములపై సీబీఐ, ఈడీ విచారణలు జరుగుతున్నాయని, తీర్పు వెలువడే వరకూ వేచి చూడాలన్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details