చెరువులో జలకళ.. చేపల మిలమిల.. - చేపల వేట
Fish : చినుకు కురిస్తే.. చిన్నపిల్లలే కాదు.. చేప పిల్లలూ చిందు లేస్తాయి. కొత్త వానతో వచ్చే వరద నీటిలో తేలియాడేందుకు తెగ సంబర పడతాయి..! వాగులు, వంకల్లోంచి పరిగెడుతూ వచ్చే బురద నీటిలోకి.. చేపలు గుంపులు గుంపులుగా ఎదురెళ్తాయి..! అలాంటి సన్నివేశమే ఇక్కడ చూడొచ్చు. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు సూర్యాపేట జిల్లా మోతె మండలం నామవరంలో.. పెద్ద చెరువు పూర్తిగా నిండిపోయింది. చెరువు అలుగుపారడంతో.. మత్తడి వద్దకు చేపలు గంపులు గంపులుగా వచ్చి సందడి చేశాయి. ఒకే చోట వందలాది చేపలు కనిపించడంతో.. స్థానికులు ఆశ్చరంగా చూశారు. కాపలాదారులు మాత్రం.. అవి ఎవరి చేతికీ చిక్కకుండా డ్యూటీ చేశారు.
fish
.