ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: యాదాద్రి ఆలయ సిబ్బందికి ఈవో నోటీసులు - eo notices to yadadri temple staff

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో ఆలయ సిబ్బందికి, అర్చకులకు ఈవో గీతారెడ్డి సంజాయిషీ నోటీసులు ఇచ్చారు. అనుమతి లేకుండా గర్భాలయంలోకి ఇటీవల కొందరు వ్యక్తులను అనుమతించడంపై చర్యలు తీసుకున్నారు. పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు

eo notices to yadadri temple staff
తెలంగాణ: యాదాద్రి ఆలయ సిబ్బందికి ఈవో నోటీసులు

By

Published : Jun 23, 2020, 7:51 PM IST

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి క్షేత్రంలో అనుమతి లేకుండా యాదాద్రి గర్భాలయంలోకి ఇటీవల కొందరు వ్యక్తులు ప్రవేశించడానికి సహకరించిన ఆలయ సిబ్బందికి, అర్చకులకు ఈవో గీతారెడ్డి మెమోలు జారీ చేశారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులు జరుగుతున్న కాలంలో గర్భాలయంలోకి అధికారుల ముందస్తు అనుమతి లేకుండా వెళ్లకూడదనే నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాటికి విరుద్ధంగా ప్రవర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నారు.

పది రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు అర్చకులు, ఇద్దరు అటెండర్లు, ఒక అధికారి ఉన్నారు.

ఇదీ చూడండి:శానిటైజర్ చేతులకే కాదు...ఇలా కూడా వాడొచ్చా!

ABOUT THE AUTHOR

...view details