ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కర్రలు, బీరు సీసాలే ఆయుధాలు.. రోడ్డున పడి తన్నుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులు! - గంగారంలో విద్యార్థుల ఘర్షణ

Engineering students fight: వారంతా ఇంజినీరింగ్ స్టూడెంట్స్.. కొత్త కాలేజీ.. కొత్త జోష్.. అక్కడ వారికి పక్కవారితో చదువు సంగతేమో కానీ.. ఫైటింగ్​లో పోటీ పడ్డారు. సీనియర్లు, జూనియర్లు రెండుగా విడిపోయి.. తప్ప తాగి గల్లీ రౌడీగా కొట్టుకున్నారు. ఇంతకీ ఎక్కడ జరిగిందంటే?

రోడ్డున పడి తన్నుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులు!
రోడ్డున పడి తన్నుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులు!

By

Published : May 1, 2022, 8:51 PM IST

Engineering students fight: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్న ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు.. రెండు గ్రూపులుగా విడిపోయి మూకుమ్మడిగా దాడి చేసుకున్నారు. జూనియర్, సీనియర్ విద్యార్థులు పరస్పరం.. కర్రలు, బీరు సీసాలు, రాళ్లతో కొట్టుకున్నారు.

రోడ్డున పడి తన్నుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులు!

మద్యం మత్తులో విద్యార్థుల మధ్య గొడవ చెలరేగి కొట్టుకున్నారని తెలుస్తోంది. ఈ ఘటనకు కారణమైన ఓ స్టూడెంట్​ను సస్పెండ్‌ చేశారని తెలిసింది. బుద్ధిగా చదువుకోవాల్సిన విద్యార్థులు గొడవలకు దిగడం చూసి స్థానికులు ముక్కున వేలేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details