ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్న తెరాస ఎమ్మెల్సీ కవిత - ED Notices

MLC Kavitha: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంపై తెరాస ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా స్పందించారు. తనకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు.

kavitha
kavitha

By

Published : Sep 16, 2022, 6:20 PM IST

MLC Kavitha: దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే తనకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని కవిత స్పష్టం చేశారు. దిల్లీలో కూర్చుని కొందరు మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. మీడియా తమ సమయాన్ని నిజాలను చూపించేందుకు ఉపయోగించాలని కోరారు.

దిల్లీలో కూర్చొని కొందరు కావాలనే మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారు. మీ సమయాన్ని నిజం చూపించడానికి ఉపయోగించాలని నేను అన్ని మీడియా సంస్థలను అభ్యర్థిస్తున్నా. టీవీ వీక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు, నాకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేయాలనుకుంటున్నా.-ట్విటర్​లో ఎమ్మెల్సీ కవిత

ఇవి చదవండి:

ABOUT THE AUTHOR

...view details