Karvy Scam Updates: కార్వీ ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. కార్వీ ఎండీ పార్థసారథికి చెందిన షేర్లతో పాటు స్థిరాస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. మొత్తం 1984 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులున్నాయి. వీటిలో రూ. 213 కోట్లు విలువ చేసే భూములు, 438 కోట్ల రూపాయల షేర్లు, 1280 కోట్ల రూపాయలు విలువ చేసే ఇతర ఆస్తులును ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Karvy Scam Updates : కార్వీ సంస్థ స్థిరాస్తులను అటాచ్ చేసిన ఈడీ - Karvy Scam Updates
18:51 March 09
కార్వీ సంస్థ స్థిరాస్తులను అటాచ్ చేసిన ఈడీ
Karvy Scam News : పెట్టుబడిదారులకు చెందిన షేర్లను కార్వీ ఎండీ పార్థసారథి.. బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. పలు బ్యాంకుల్లో దాదాపు రూ.2800కోట్ల రుణం తీసుకున్నారు. వీటిని డొల్ల కంపెనీలకు మళ్లించి సొంత పేర్లతో ఆస్తులు కొనుగోలు చేశారు. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని పార్థసారథితో పాటు, మరో నలుగురిని అరెస్ట్ చేశారు.
ED Attached Karvy Assets : సీసీఎస్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు మనీల్యాండరింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనవరి 20వ తేదీన ఈడీ అధికారులు పార్థసారథిని బెంగళూర్లో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి చంచల్ గూడ జైలుకు తరలించారు. కార్వీ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి
TAGGED:
Karvy Scam Updates