అక్షయ గోల్డ్‌కు చెందిన రూ.268 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. 10 రాష్ట్రాల్లో 19.7 లక్షల మంది నుంచి రూ.857 కోట్లు వసూలు చేసిన అక్షయ గోల్డ్ సంస్థ.. ప్రజల సొమ్ముతో వివిధ చోట్ల ఆస్తులు కొనుగోలు చేసింది. ఆ తర్వాత తిరిగి చెల్లింపులు సక్రమంగా చేయకపోవడంతో.. వివిధ పోలీసుస్టేషన్లలో 29 కేసులు నమోదయ్యాయి.
2012 మే 9న ఒంగోలులో నమోదైన కేసు ఆధారంగా సీఐడీ అధికారులు సుబ్రహ్మణ్యం, హేమంత్‌బాబు, సుధాకర్‌రావు, మరికొందరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐడీ కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.