పశ్చిమగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన...కరోనా వైరస్ను పూర్తిగా నియంత్రించి...ప్రజలందర్నీ సుఖసంతోషాలతో ఉంచాలని ఆకాంక్షించారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరారు. కరోనా కాలంలో దేవాదాయ సిబ్బందిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. దేవాలయాల్లో దర్శనాలు తగ్గటంతో పాటు ఆదాయం కూడా తగ్గిపోయిందన్నారు. ఉద్యోగులు, సిబ్బంది జీతాల విషయంలో రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా చూస్తామని స్పష్టం చేశారు.
సిబ్బంది జీతాల విషయంలో ఇబ్బందులు రానివ్వం: మంత్రి వెల్లంపల్లి - ద్వారకా తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం
కరోనా కాలంలో దేవాదాయ ఉద్యోగులు, సిబ్బందిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. జీతాల విషయంలో రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు.
Endowments minister Vellampalli Srinivasa Rao