Endowment Minister: వేసవి నేపథ్యంలో ఆలయాలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. క్యూలైన్లతోపాటు, ఆరుబయట కూడా చలువ పందిళ్లు వేసి ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆయన శుక్రవారం సచివాలయం నుంచి కమిషనర్ హరిజవహర్‌లాల్‌తో కలిసి ఆర్‌జేసీ, డీసీ, ఏసీ క్యాడర్ కలిగిన ఆలయాల ఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏయే రోజుల్లో భక్తులు ఎక్కువగా వస్తారనేది అంచనావేసి ఈ మేరకు క్యూలైన్లలో ఏర్పాట్లు ఉండేలా చూడాలన్నారు. హారతి, కైంకర్యాలు సమర్పించే ముందు మైక్‌లో ప్రకటించి, భక్తులు అసహనానికి గురికాకుండా చూడాలని నిర్దేశించారు. ఆలయాల పరిధిలో ప్లాస్టిక్ వాడకుండా చూడాలని ఆదేశించారు.
"ఆలయాల్లో భక్తులు ఇబ్బందులు పడకుండా... జాగ్రత్తలు తీసుకోవాలి" - ఏపీ లేటెస్ట్ అప్డేట్స్
Endowment Minister: వేసవి నేపథ్యంలో ఆలయాలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. హారతి, కైంకర్యాలు సమర్పించే ముందు మైక్‌లో ప్రకటించి, భక్తులు అసహనానికి గురికాకుండా చూడాలని నిర్దేశించారు.
దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
ఆలయాల పరిధిలో దుకాణదారులు అధిక ధరలకు విక్రయాలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఈవోలను కమిషనర్ హరిజవహర్‌లాల్ ఆదేశించారు. వేసవి వల్ల అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ సూచించారు.
ఇదీ చదవండి: Tirumala : శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు ... భక్తుల ఎదురుచూపులు