ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Huzurabad By-poll: 'మమ్మల్ని నామినేషన్​ వేయనీయరా ?'..ఎందుకు కుంటిసాకులు ! - Huzurabad Bypoll Nomination

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో తెలంగాణలోని హుజరాబాద్​లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున ఫీల్డ్ అసిస్టెంట్లు సిద్దమయ్యారు. దాదాపు 70 మంది నామినేషన్​ కోసం తరలివెళ్లగా..తమను నామినేషన్లు వేయనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యక్ష ప్రశ్నలతో అడ్డుకుంటున్నారని నిరసన వ్యక్తం చేశారు.

'మమ్మల్ని నామినేషన్​ వేయనీయరా ?'
'మమ్మల్ని నామినేషన్​ వేయనీయరా ?'

By

Published : Oct 7, 2021, 10:09 PM IST

తెలంగాణలో జరగనున్న హుజూరాబాద్​ ఉపఎన్నికలో నామినేషన్ల కోసం.. ఉపాధి హామీ ఫీల్డ్​ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తాము గత మూడు రోజులుగా నామినేషన్లు వేయడానికి వస్తుంటే.. కుంటి సాకులతో అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 70 మంది నామినేషన్​ కోసం తరలిరాగా.. పెద్ద క్యూలో నిలబడ్డారు. వ్యాక్సిన్​ రెండు డోసులు వేసుకున్నారా ? బలపరిచేందుకు పది మందిని తీసుకువచ్చారా ? అని యక్ష ప్రశ్నలతో అడ్డుకుంటున్నారని నిరసన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన అధికారులు ప్రజాస్వామ్యంలో ఎవరైనా నామినేషన్​ వేయవచ్చని ఎవరిని అడ్డుకోబోమన్నారు. కొవిడ్​ నిబంధనలకు అనుగుణంగా నామినేషన్​ వేయవచ్చని సూచించారు.

ఇటీవలే హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by election nomination)లో రోజుకు వేయి మందితో నామినేషన్లు వేయిస్తామని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ క్షేత్రసహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామలయ్య తెలిపారు. 18 నెలల నుంచి తమను విధుల్లోకి తీసుకోకపోవడం వల్లే ఈ చర్యకు ఉపక్రమించినట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో.. ఫీల్డ్ అసిస్టెంట్లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా తమను విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇవ్వకపోతే.. హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by election nomination)లో రోజుకు వేయి మందితో నామినేషన్ వేయిస్తామని(Field Assistants) హెచ్చరించారు. అందులో భాగంగానే ఉపాధి హామీ ఫీల్డ్​ అసిస్టెంట్లు హుజూరాబాద్​ ఉపఎన్నికలో నామినేషన్ వేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఉపఎన్నిక వివరాలిలా...

ఇటీవలే హుజూరాబాద్​ ఉపఎన్నిక(Huzurabad By Election 2021) షెడ్యూల్ వచ్చింది. ఉపఎన్నికకు అక్టోబర్ 2న నోటిఫికేషన్​ ఇవ్వనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అక్టోబర్ 8 వరకు నామినేషన్ల స్వీకరణ, 11న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరపనున్నట్లు తెలిపింది. వాటి ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు విధించింది. అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad By Election Polling 2021) పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు తెలిపింది.

ఈటల రాజీనామాతో ఎన్నిక అనివార్యం

తెలంగాణ మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్​ నియోజకవర్గం(Huzurabad By Election 2021)లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి నియోజకవర్గంలో రాజకీయం రంజుగా మారింది. ఇటు అధికార తెరాస, అటు భాజపా నేత ప్రచారాల(Huzurabad By Election Campaign 2021)తో హోరెత్తుతోంది. ఇప్పటికే తెరాస మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంలోనే ఉండి.. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటున్నారు. రోజుకో వర్గానికి సంబంధించి ఆత్మీయ, సమ్మేళన సభలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లో తెరాసపై పాజిటివ్ టాక్ తీసుకొస్తున్నారు.

ఇదీ చూడండి: ENC Letter : కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ మరో లేఖ

ABOUT THE AUTHOR

...view details