ఆంధ్రప్రదేశ్

andhra pradesh

EMPLOYEES PROTEST: పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా సచివాలయంలో పెన్​ డౌన్​

By

Published : Feb 4, 2022, 11:06 AM IST

Updated : Feb 5, 2022, 7:15 AM IST

సచివాలయంలో పెన్​ డౌన్​
సచివాలయంలో పెన్​ డౌన్​

11:04 February 04

protest against New PRC GOs: ఇవాళ సచివాలయంలో ఉద్యోగుల నిరసన

PRC:పీఆర్సీపై నిరసనల్లో భాగంగా రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయంలో ఉద్యోగులు పెన్ డౌన్, యాప్ డౌన్ చేపట్టారు. సచివాలయంలో కంప్యూటర్లన్నీ షట్ డౌన్ చేసి నిరసన తెలిపారు. దీనివల్ల సచివాలయంలో ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రభుత్వం దిగొచ్చే దాకా పోరాటం ఆగదని.. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని ఉద్యోగులు పునరుద్ఘాటించారు.

Employees Union: చర్చలకు రావాలన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్​ శర్మ వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాల నేతలు స్పందించారు. నేడు స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించిన అనంతరం.. చర్చలకు వెళ్లాలా ? వద్దా ? అనే విషయాన్ని వెల్లడిస్తామని ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాసరావు చెప్పారు. చలో విజయవాడ సందర్భంగా.. అదుపులోకి తీసుకున్న ఉద్యోగులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

'చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పలువురు పోలీసులు ప్రయత్నించారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ బేషరతుగా విడుదల చేయాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఉద్యోగులు.. సహకరించిన పోలీసులు, ఉద్యమకారుల ఆకలి, తప్పిక తీర్చిన స్థానికులకు సాధన సమితి తరఫున దన్యావాదాలు తెలుపుతున్నామని ఆయన అన్నారు.

ఇదీ చదవండి..

మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో విచారణ ప్రారంభం

Last Updated : Feb 5, 2022, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details