కార్యాలయాలు తరలించొద్దు : సచివాలయ ఉద్యోగులు - taaza news on sachivalaya employees
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని సచివాలయ ఉద్యోగులు కలిశారు. విజిలెన్స్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ విజిలెన్స్ కమిషనర్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను కర్నూలుకు తరలించవద్దని విజ్ఞప్తి చేశారు.
విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం సహా.. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యకలాపాలను కర్నూలుకు తరలించొద్దంటూ ఆ విభాగపు ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎస్ నీలం సాహ్నికి విజ్ఞప్తి చేశారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిశారు. ఈ 2 విభాగాలూ సాధారణ పరిపాలన శాఖలో భాగమని నివేదించారు. ప్రతి శాఖకు చెందిన వివరాలు విజిలెన్స్ కమిషన్‌కు చేరవేయాల్సి ఉంటుందన్న ఉద్యోగులు నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ఈ రెండు విభాగాలనూ అన్ని శాఖలతో కలిపి సచివాలయ పరిధిలోనే ఉంచాలని నివేదించారు. అయితే ఈ రెండు విభాగాలు జ్యుడీషయల్ పరిధిలో ఉన్నందునే కర్నూలుకు తరలిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు ఉద్యోగులకు సీఎస్ తెలిపారు. ఈ అంశంపై మరోసారి అధ్యయనం చేసి రెండు శాఖలూ సచివాలయం పరిధిలో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు.