ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హెచ్‌ఆర్‌ఏ, అదనపు పింఛను సౌకర్యాలు అలాగే ఉంచాలి.. సీఎస్​కు ఉద్యోగ సంఘాల వినతి - పింఛన్​లపై సీఎస్​ను కలిసిన ఉద్యోగ సంఘాలు

సీఎస్ సమీర్‌శర్మను కలిసిన ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు
సీఎస్ సమీర్‌శర్మను కలిసిన ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు

By

Published : Jan 10, 2022, 5:34 PM IST

Updated : Jan 10, 2022, 6:58 PM IST

17:32 January 10

సీఎస్ సమీర్‌శర్మను కలిసిన ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు

హెచ్‌ఆర్‌ఏ, అదనపు పింఛను సౌకర్యాలు అలాగే కొనసాగించాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు.. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాస రావు, ఇతర నేతలు సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మను కలిశారు. పీఆర్సీలో భాగంగా హెచ్ఆర్ఏ, సీసీఏ, పెన్షనర్లకు ఇచ్చే అదనపు పెన్షన్ సౌకర్యాలను ఇంతకు ముందున్న విధంగా కొనసాగించాలని కోరారు. అమరావతి ఐక్యవేదిక నుంచి వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగులకు 70, 75 సంవత్సరాలకు ప్రభుత్వం చెల్లిస్తున్న అదనపు పెన్షన్ 10%, 15% శాతం సౌకర్యాలను తగ్గించకూడదని నేతలు కోరారు.

ఇదీ చదవండి: AP Govt On PRC: ప్రభుత్వ ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్‌మెంట్‌

Last Updated : Jan 10, 2022, 6:58 PM IST

ABOUT THE AUTHOR

...view details