ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యుత్ ఉద్యోగుల కేటాయింపుపై కమిటీ నియామకం - ap discoms news

కొత్తగా ఏర్పాటుచేసిన సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్​కు ఉద్యోగుల కేటాయింపుపై ప్రభుత్వం కమిటీని నియమించింది. కమిటీలో ఏపీ ట్రాన్స్​కో జేఎండీ కెవీఎన్ చక్రధర్​బాబు ఛైర్మన్​గా ఏపీఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్ సీఎండీలు సభ్యులుగా ఉంటారు.

విద్యుత్ ఉద్యోగుల కేటాయింపుపై కమిటీ నియామకం
విద్యుత్ ఉద్యోగుల కేటాయింపుపై కమిటీ నియామకం

By

Published : Jun 23, 2020, 8:55 PM IST

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్​కు ఉద్యోగుల కేటాయింపుపై కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ - ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మధ్య ఉద్యోగుల విభజనపై అధికారుల కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఏపీ ట్రాన్స్​కో జేఎండీ కేవీఎన్ చక్రధర్​బాబు ఛైర్మన్​గా ఏపీఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్ సీఎండీలు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. నిబంధనల మేరకు రెండు డిస్కంల మధ్య ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన విభజించనున్నారు. ఉద్యోగుల విభజనకు సంబంధించిన నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాల్సిందిగా అధికారుల కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details