మిరప రైతులను ఆదుకోవాలంటూ.. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. పంటచేతికొచ్చిన సమయంలో లాక్ డౌన్ కారణంగా కూలీల కొరత ఏర్పడిందన్నారు. ప్రతి రైతుకు 50 శాతం పెట్టుబడి పెరిగిందని లేఖలో తెలిపారు. ప్రధాన వాణిజ్య పంటైన మిర్చిని కాపాడుకోకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని మిరప రైతులకు ఆసరాగా ఉండాలని కోరారు. రాబోయే 15 రోజుల్లో కోతలు, పంట ఎండబెట్టుకునేందుకు, కోత అనంతరం తీసుకోవాల్సిన చర్యలకు పోలీసుల నుంచి ఇబ్బందులు లేకుండా మినహాయింపు ఇవ్వాలని కోరారు. మిర్చి యార్డులు తెరచి ఉంచాలన్నారు. మిర్చి అనుబంధ పరిశ్రమలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇస్తేనే.. రైతులకు మేలు జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. కోల్డ్ స్టోరేజీ ఉన్న మిరప పంటకు మార్కెట్ విలువ ప్రకారం 75 శాతం లోన్ సదుపాయం కల్పించాలన్నారు. ఈ లేఖను ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రులు, ప్రకాశం జిల్లా మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్కు పంపారు.
మిరప రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే లేఖ
ప్రధాన వాణిజ్య పంట అయిన మిర్చిని కాపాడుకోకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఈమేరకు మిరప రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు.
Eluri Sambashivarao Letter To Cm jagan