తెలంగాణలో వరంగల్-నల్గొండ-ఖమ్మం స్థానంలో ఇప్పటివరకు 67 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ అభ్యర్థుల ఓట్లు మిగతా అభ్యర్థులకు బదిలీ అయ్యాయి. పల్లా రాజేశ్వర్ రెడ్డికి 6,546 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 8,568 ఓట్లు, కోదండరాంకు 9,038 ఓట్లు జమ అయ్యాయి.
తెలంగాణ: నల్గొండ స్థానంలో 67 మంది ఎలిమినేషన్ - Telangana graduates MLC votes news
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. వరంగల్-నల్గొండ-ఖమ్మం స్థానంలో ఇప్పటివరకు 67 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
![తెలంగాణ: నల్గొండ స్థానంలో 67 మంది ఎలిమినేషన్ elimination process continue in warangal, nalgonda, khammam mlc election counting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11081976-836-11081976-1616213680928.jpg)
నల్గొండ స్థానంలో 67 మంది ఎలిమినేషన్
ప్రస్తుతం తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 25,528 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 1,17,386 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 91,858 ఓట్లు, కోదండరాంకు 79,110 ఓట్లు, ప్రేమేందర్‌రెడ్డికి 42,015 ఓట్లు వచ్చాయి. విజయం సాధించాలంటే 1,83,167 ఓట్లు రావాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
ఇదీ చదవండి:తెలంగాణ: నాలుగో రోజు కొనసాగుతోన్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు