ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల నిరసన

రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తు ఉద్యోగుల నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్తు ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని డిమాండ్‌ చేశారు.

Electricity employees protest to oppose the tariff bill proposed by the central government
రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల నిరసన

By

Published : Jun 2, 2020, 6:51 AM IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్తు ముసాయిదా బిల్లు అమల్లోకి వస్తే విద్యుత్తు సంస్థలకు తీవ్ర నష్టం కలుగుతుందని ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు పేర్కొన్నారు. ఆ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని డిమాండ్‌ చేశారు. జాతీయ విద్యుత్తు ఉద్యోగ సంఘాల ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు ముసాయిదా బిల్లుకు వ్యతిరేకంగా సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో... నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా డిస్కంలు, జెన్‌కో, ఉత్పత్తి యూనిట్లలో పనిచేస్తున్న సిబ్బంది ఎక్కడికక్కడ కార్యాలయాల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విజయవాడలోని విద్యుత్తు సౌధలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో విద్యుత్తు ఉద్యోగుల ఐకాస కన్వీనర్‌ వేదవ్యాసరావు పాల్గొని బిల్లుతో కలిగే నష్టాలను వివరించారు.

ABOUT THE AUTHOR

...view details