ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Charging points in IOC Petrol bunks: ఐవోసీ పెట్రోలు బంకుల్లో.. విద్యుత్‌ ఛార్జింగ్‌ కేంద్రాలు

ఐవోసీ పెట్రోలు బంకుల్లో విద్యుత్‌ ఛార్జింగ్‌ కేంద్రాలను అందుబాటులోకి తేనున్నారు. ఈ మేరకు నెడ్​క్యాప్ ఐవోసీతో ఒప్పందం కుదుర్చుకోనుంది.

petrol
petrol

By

Published : Jul 26, 2021, 10:09 AM IST

రాష్ట్రంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) పెట్రోలు బంకుల్లో విద్యుత్‌ ఛార్జింగ్‌ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్‌) భావిస్తోంది. ఈ మేరకు ఐవోసీతో ఒప్పందం కుదుర్చుకోనుంది. వివిధ కంపెనీలు విద్యుత్‌ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకొచ్చాయి. ఒకసారి ఛార్జి చేస్తే సుమారు 300 కి.మీ వరకు ప్రస్తుతం ఉన్న బ్యాటరీ సాయంతో ప్రయాణించటానికి అవకాశం ఉంది. అంతకు మించి ప్రయాణించాలంటే ఛార్జింగ్‌ కేంద్రాలు అందుబాటులో లేవు.

దీన్ని దృష్టిలో ఉంచుకుని జాతీయ రహదారులు, పెట్రోలు బంకుల దగ్గర ఛార్జింగ్‌ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని పెంచాలని నెడ్‌క్యాప్‌ భావిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐవోసీకి సుమారు 2,400 పెట్రోలు బంకులున్నాయి. అందులో కనీసం మూడు వాహనాలను ఛార్జింగ్‌ కోసం నిలిపే అవకాశం ఉన్న బంకులను సంస్థ గుర్తిస్తోంది. వాటిల్లో అల్ట్రా స్పీడ్‌ ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా మీటర్‌ను విద్యుత్‌ శాఖ ఏర్పాటు చేస్తుంది. వినియోగదారుని నుంచి వసూలు చేసే ఛార్జీల నుంచి విద్యుత్‌ బిల్లును చెల్లించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details