తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయ(Yadadri Temple) పునర్నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. క్షేత్రాన్ని(Yadadri Temple) సందర్శించే భక్తులు ఆహ్లాదాన్ని పొందేలా ఆలయ పరిసరాలను తీర్చిదిద్దుతున్నారు. అష్టభుజ మండప ప్రాకారంలోని పైకప్పుకు పసిడి వర్ణంలోని తామర పుష్పాల ఆకారంలో విద్యుత్ బల్బులను అమర్చుతున్నారు. మహాముఖ మండపంలోనూ వీటిని బిగిస్తున్నారు.
Yadadri Temple : తామరపుష్పాలు కావవి.. వెలుగులీనే విద్యుద్దీపాలు - telangana top news
l యాదాద్రి ఆలయ(Yadadri Temple) పునర్నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. వివిధ వనరులతో క్షేత్ర స్థాయిని పెంపొందించే దిశలో "యాడా" అడుగులు వేస్తోంది. ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఆలయ పరిసరాలను సంప్రదాయ హంగులతో తీర్చిదిద్దుతున్నారు.
yadadri temple
వీఐపీల కోసం ఏర్పాటైన లిఫ్టును మందిర రూపంగా తీర్చిదిద్దుతున్నారు. పక్కనే స్వామి రథశాలను సన్నద్ధం చేస్తున్నారు. దర్శన వరుసల ఏర్పాట్ల పనులు వేగవంతం చేసినట్లు నిపుణులు వెల్లడించారు. ప్రత్యేక ప్రణాళికలతో పనులు కొనసాగుతున్నాయని... క్షేత్రాభివృద్ధి తుదిదశకు చేరిందని తెలిపారు. ప్రత్యేక వనరుల కల్పనతో క్షేత్రాభివృద్ధి తుదిదశకు చేరిందని ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి చెప్పారు.