కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల పాటు వాయిదా వేసింది. సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత సమీక్ష నిర్వహించి.. ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ వెల్లడించారు. పార్టీలు, ఉద్యోగులు, అన్ని వర్గాలతో చర్చించిన అనంతరం ఈ అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు.
‘కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా ఊహించని మార్పులు వచ్చాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పేపర్ బ్యాలెట్ వల్ల కరోనా విస్తరించే ప్రమాదం ఉంది. విధిలేని పరిస్థితుల్లోనే స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నాం. పార్టీలు, ఉద్యోగులు, అన్ని వర్గాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆరు వారాల తర్వాత సమీక్ష చేపడతాం. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే ఎన్నికలు నిర్వహిస్తాం. ఆరు వారాల తర్వాత ఎన్నికల ప్రక్రియ మళ్లీ ప్రారంభమవుతుంది' - రమేశ్ కుమార్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్
కోడ్ కొనసాగుతుంది..