ఏపీఎస్‌ఆర్టీసీలో ఎన్నికల సందడి మొదలైంది. 2022 నుంచి 2026 సంవత్సరం వరకు ఉద్యోగుల పొదుపు, క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (సీసీఎస్)కు సభ్య ప్రతినిధుల ఎన్నిక డిసెంబరు 14న నిర్వహించాలని నిర్ణయించారు. 350 మంది అధికారులు మినహా మిగిలిన 50 వేల మంది ఉద్యోగుల్లో దాదాపు అంతా ఈ సొసైటీలో సభ్యులుగా ఉంటారు. డిపో, గ్యారేజ్‌ల పరిధిలో ఉద్యోగుల సంఖ్యను బట్టి సభ్య ప్రతినిధుల సంఖ్య ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 210 మంది సభ్య ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఇలా గెలిచినవారు డిసెంబరు 29న జరిగే మరో ఎన్నికలో 9 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. సాధారణంగా 210 మంది సభ్య ప్రతినిధులకుగాను, 106 మంది ఏ యూనియన్ మద్దతుదార్లు గెలుస్తారో.. ఆ ప్యానెల్‌కు చెందిన వారే మేనేజింగ్ కమిటీ సభ్యులుగా గెలిచేందుకు వీలుంటుంది.
మద్దతు కోసం మంతనాలు..