వచ్చే ఏడాది ఖాళీ కానున్న ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. మార్చి 29తో ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. రాము సూర్యారావు, ఏ.ఎస్.రామకృష్ణ పదవీకాలం పూర్తి కానుంది. ఖాళీ అయ్యే స్థానాలకు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోన్న ఈసీ... సంబంధిత నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను ప్రారంభించనుంది.
ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ప్రక్రియ ప్రారంభించిన ఈసీ - teacher mlc elections inp news
మార్చి 29తో ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. సంబంధిత నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను ప్రారంభించనుంది.
ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ప్రక్రియ ప్రారంభించిన ఈసీ
ఓటర్ల జాబితా తయారీ కోసం అక్టోబర్ ఒకటో తేదీన బహిరంగ నోటీసు ఇస్తారు. ఓటరు నమోదు కోసం దరఖాస్తులకు నవంబర్ ఆరో తేదీ వరకు గడువిస్తారు. డిసెంబర్ ఒకటో తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురిస్తారు. ముసాయిదాపై డిసెంబర్ నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరిస్తారు. వాటిని పరిష్కరించి 2021 జనవరి ఒకటో తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు.
ఇదీ చదవండీ... శ్రీకాళహస్తిలో అనధికార విగ్రహాలు: నిందితుల అరెస్టు