ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యూపీ ఎన్నికలు.. తెలంగాణ ఎమ్మెల్యేకు ఎన్నికల సంఘం నోటీసులు

EC notice to Raja Singh: యూపీ ఓటర్లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలతో వీడియో చేసిన తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్​కు ఈసీ నోటీసులు జారీ చేసింది. వీడియోలో ఓటర్లను బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు ఈసీ పేర్కొంది. దీనిపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

EC notice to Raja Singh
EC notice to Raja Singh

By

Published : Feb 16, 2022, 5:38 PM IST

EC notice to Raja Singh: సంచలన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి న్యూస్​లో నిలిచారు. యూపీ ఎన్నికల సందర్భంగా యోగి ఆదిత్యానాథ్​కు మద్దతుగా రాజాసింగ్​ ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో ఓటర్లను బెదిరించినట్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఆ వీడియో ఓటర్లను బెదిరించినట్టుగా ఉందని పేర్కొన్న ఈసీ.. రాజాసింగ్​కు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే రాజాసింగ్​ విడుదల చేసిన వీడియోపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

యూపీలో ఉండాలంటే.. యోగిని గెలిపించాల్సిందే..
Raja Singh Controversy on UP Elections : ఉత్తర్​ప్రదేశ్​లో ఉండాలనుకుంటే యోగి ఆదిత్యనాథ్​కు ఓటు వేయాల్సిందేనని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భాజపాకు ఓటు వేయని వాళ్లు ఎన్నికల తర్వాత యూపీ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ ఓ వీడియో చేశారు. భాజపా శ్రేణులు, హిందువులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి.. యోగిని మరోసారి గెలిపించాలని కోరారు. ఉత్తర్​ప్రదేశ్​లో మరోసారి.. యోగి సర్కార్​ రావాలని ఆకాంక్షించారు. అంతటితో ఆగని రాజాసింగ్​.. ఓటు వేయని వాళ్ల జాబితా తీసి వాళ్ల ఇళ్ల పైకి బుల్డోజర్లు ఎక్కిస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం కోసం..Raja Singh Controversy: 'యూపీలో భాజపాకు ఓటేయకపోతే.. ఇళ్లపైకి బుల్డోజర్లు'

ABOUT THE AUTHOR

...view details