విజయవాడ నగరపాలక ఎన్నికలు వైకాపా, తెదేపాకి ప్రతిష్టాత్మకంగా మారాయి. రెండుపార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బెజవాడకే తలమానికంగా నిలిచే కనకదుర్గమ్మవారి ఆలయంలో అవినీతి వ్యవహారం నగరపాలక సంస్థ ఎన్నికల్లో రాజకీయ వేడిని రాజేసింది. అసలు దోషి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసేనంటూ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు.
పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన ఆయన.. మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గొల్లపాలెం గట్టు పరిసర ప్రాంతాల్లో నాని ప్రచారం నిర్వహించారు. మేయర్ పదవి మహిళకు రిజర్వ్‌కావడంతో.. మహిళామణులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. 10,11 డివిజన్‌లో తెలుగుదేశం, వైకాపా అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. అమరావతి రాజధానిగా కొనసాగాలంటే తెలుగుదేశాన్ని గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థిని కోరగా.. సంక్షేమ పథకాలు అందరికీ దక్కాలంటే వైకాపాకు ఓటేయ్యాలని మరో అభ్యర్థిని అభ్యర్థించారు. జనసేన సైతం ప్రచారంలో దూసుకుపోతోంది.