ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అలప్పుజలో శరవేగంగా 'ఈనాడు సహాయ నిధి' ఇళ్లు - ఈనాడు సహాయ నిధి

కేరళ అలప్పుజలో 'ఈనాడు సహాయ నిధి' కింద తొలి దశలో నిర్మిస్తోన్న 43 ఇళ్ల పనులు వడివడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం పునాదులు పూర్తి చేసుకున్నాయి. కుటుంబ శ్రీ మిషన్ తరపున నిర్మాణ పనులు చేపట్టిన మహిళలు ఉత్సాహంగా పాల్గొంటూ శరవేగంగా పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారు.

అలప్పుజలో శరవేగంగా 'ఈనాడు సహాయ నిధి' ఇళ్ల నిర్మాణమవుతున్నాయి.

By

Published : Apr 2, 2019, 6:58 AM IST

Updated : Apr 2, 2019, 7:22 AM IST

అలప్పుజలో శరవేగంగా 'ఈనాడు సహాయ నిధి' ఇళ్ల నిర్మాణమవుతున్నాయి.
కేరళ వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారి కోసం అలప్పుడజలో 'ఈనాడు సహాయ నిధి'తో తొలి దశలో నిర్మిస్తోన్న 43 ఇళ్లు పనులు వేగంగా సాగుతున్నాయి. ఇళ్ల నిర్మాణానికి మార్చి 2 శంకుస్థాపన జరిగింది. ప్రస్తుతం వీటి పునాదులు పూర్తయ్యాయి. నిర్మాణ పనులన్నీ కుటుంబ శ్రీ మిషన్ తరపున మహిళలే చేపట్టారు. ఉత్సాహంగా పాల్గొని వడివడిగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు.

రూ. 7.7 కోట్లతో ఈనాడు సహాయ నిధితో 3 దశల్లో మొత్తం 116 ఇళ్లను నిర్మించాలనేదే లక్ష్యం. ఈ ఇళ్లలో రెండు పడకగదులు, హాలు, వంటగది, బాత్ రూం సౌకర్యాలుంటాయి. సంయుక్తకలెక్టర్ కృష్ణతేజ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Last Updated : Apr 2, 2019, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details