telangana: తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం - తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం
18:34 August 23
Educational institutions will be reopened in Telangana from September 1
కరోనా మహమ్మారి విజృంభణ తగ్గిన నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలు తెరవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల పునఃప్రారంభంపై తెలంగాణ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి అన్ని విద్యా సంస్థలు పునఃప్రారంభించాలని నిర్ణయించారు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు.
కరోనా ప్రభావంతో గత మార్చిలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. మధ్యలో తొమ్మిది ఆపై తరగతులు పాక్షికంగా ప్రారంభించగా.. రెండో దశ తీవ్రత పెరగడంతో మళ్లీ ఆన్‌లైన్ బోధనకే పరిమితం చేశారు. గత నెల ఒకటి నుంచే అన్ని తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. హైకోర్టు పలు ప్రశ్నలు సంధించడంతో వెనక్కి తగ్గారు. కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలు ఈనెలలోనే విద్యాసంస్థలు తెరుస్తున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు.
ఇదీ చదవండి: