ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యాశాఖ: 'త్వరలో కీలక నిర్ణయాలు తీసుకుంటాం'

By

Published : Apr 22, 2021, 7:15 PM IST

కొవిడ్ కేసులు నమోదు అవుతుంటేనే పాఠశాలలు మూసివేసి నియంత్రణ కార్యక్రమాలు చేపడుతున్నామని.. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ఉన్నత తరగతులకు సంబంధించి త్వరలోనే నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. మంత్రుల కమిటీ సమావేశానికి హాజరైన మంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడారు.

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్

విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో కోర్సులు, పరీక్షలు పూర్తికాకపోతే ఏం చేయాలన్న దానిపై సీఎం నిర్వహించే సమీక్షలో తదుపరి నిర్ణయం తీసుకుంటామని.. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు 90 శాతం మేర పూర్తి అయ్యాయని తెలిపారు. ఇప్పటికే 9 తరగతి వరకూ విద్యార్థుల్ని పైతరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. విద్యార్థులు సంయమనం పాటించాలని మంత్రి సూచించారు.

సెలవులు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వ బాధ్యత ముగియలేదని మంత్రి సురేశ్ వ్యాఖ్యానించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో కొవిడ్ నిబంధనలు సరిగ్గా పాటించటం లేదని.. ప్రభుత్వ పాఠశాలలు, సంస్థల్లో పకడ్బందీగా నిబంధనలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. విద్యార్థులు అమూల్యమైన విద్యా సంవత్సరాన్ని కోల్పోతే విపక్షనేత లోకేశ్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నేతలు కొవిడ్ విపత్కర పరిస్థితిని తమ రాజకీయ అవసరాలు కోసం వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండీ... కరోనా వ్యాప్తి నియంత్రణంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం

ABOUT THE AUTHOR

...view details