eamcet results 2022 telangana: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూహెచ్ ప్రాంగణంలో మంత్రి వెల్లడించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌లో టాప్-10 ర్యాంకులను మంత్రి వెల్లడించారు. ఇంజినీరింగ్‌లో లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డికి మొదటి ర్యాంకు, సాయిదీపికకు రెండో ర్యాంకు, కార్తికేయకు మూడో ర్యాంకు సాధించినట్లు వివరించారు.
Eamcet Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. త్వరలోనే కౌన్సెలింగ్ ప్రారంభం - తెలంగాణ ఎంసెట్ ఫలితాలు 2022
eamcet results 2022 telangana: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌లో టాప్-10 ర్యాంకులు సాధించిన వారి పేర్లను వెల్లడించారు.
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
అగ్రికల్చర్‌లో నేహాకు మొదటి ర్యాంకు, రోహిత్‌కు రెండో ర్యాంకు, తరుణ్‌కుమార్‌కు మూడో ర్యాంకు సాధించారు. గత నెల 18 నుంచి 21 వరకు ఇంజినీరింగ్, 30, 31న అగ్రికల్చర్, ఫార్మా ఎంసెట్ పరీక్షలు నిర్వహించారు. ఇంజినీరింగ్‌కు 1,56,812 మంది, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల కోసం 80,575 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
ఇవీ చదవండి: