అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా రాష్ట్ర విద్యా ప్రణాళికను తయారుచేస్తున్నామని... విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. ఆంగ్ల మాధ్యమంతోపాటు తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. అభ్యాసన ఫలితాలు, ఇతర ప్రమాణాల ఆధారంగా పాఠ్య పుస్తకాలు రూపొందించే కార్యాచరణ చేపట్టామన్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన చేసేందుకు 3 స్థాయిల్లో శిక్షణ ఇస్తామని మంత్రి వెల్లడించారు. తరగతి గది బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించేందుకు... ఆన్లైన్ సేవలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాలల్లో భాషా ప్రయోగ కేంద్రాలు ఏర్పాటుచేసి... ఆంగ్లంపై నైపుణ్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి సురేశ్ వివరించారు.
'తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం ఇస్తాం' - English medium in ap govt schools
ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు బోధనకు... సముచిత ప్రాధాన్యత ఇస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా విద్యా ప్రణాళికను తీర్చిదిద్దుతామని వివరించారు. ఆంగ్ల మాధ్యమంలో బోధనకు 3 స్థాయిల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని మంత్రి చెప్పారు.
!['తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం ఇస్తాం' Education minister adimulapu suresh on English medium](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5283219-490-5283219-1575568736386.jpg)
'తరగతి బోధనలో ఆన్లైన్ సేవలు'
'తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం ఇస్తాం'
ఇదీ చదవండి :