ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వారం రోజుల్లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌

ఈ ఏడాది.. పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. వారం రోజుల్లో పరీక్షల షెడ్యూల్‌ ప్రకటిస్తామని అన్నారు. ఏప్రిల్, మే లో పరీక్షలు ఉండొచ్చని తెలిపారు.

By

Published : Jan 23, 2021, 7:12 AM IST

Education Minister Adimulapu Suresh has said that tenth class examinations will be conducted
వారం రోజుల్లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌

వారం రోజుల్లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌

ఈ ఏడాది.. పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. పరీక్షలను 11 ప్రశ్నా పత్రాలా? లేక ఆరింటితో నిర్వహించాలా? అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వారం రోజుల్లో పరీక్షల షెడ్యూల్‌ ప్రకటిస్తామని చెప్పారు. ఏప్రిల్, మే లో పరీక్షలు ఉండొచ్చని అన్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి పాఠశాలలను ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహిస్తామన్నారు.

కేంద్రం జారీ చేసే కొవిడ్‌ నిబంధనలను పరిశీలించి.. 1-5 తరగతుల బడులు పునః ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ డైరీని మంత్రి ఆవిష్కరించారు. ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా అడుగులు వేస్తున్నందునే ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ పదవి తీసుకున్నానని ఛైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య వెల్లడించారు. పదవీ కావాలని తాను అడగలేదని, ప్రభుత్వమే ఇచ్చిందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details