కరోనా ప్రభావం వల్ల తెలంగాణలో సుదీర్ఘంగా మూతపడిన పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 9, 10వ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు 9, 10 తరగతుల క్యాలెండర్‌ను విద్యాశాఖ ప్రకటించింది.
తెలంగాణలో మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు
తెలంగాణలో పదో తగరతి పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10వ తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. పదో తరగతి పరీక్షలు ముగిసిన మరుసటి రోజు(మే 26) నుంచి జూన్ 13వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు.
తెలంగాణలో మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు
మార్చి 15 నుంచి అసెస్‌మెంట్-1 పరీక్షలు, ఏప్రిల్ 15 నుంచి అసెస్‌మెంట్-2 పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. మే 7 నుంచి 13 వరకు సమ్మెటీవ్ అసెస్‌మెంట్ పరీక్షలు.. మే 17 నుంచి 26 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. మే 27 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులుగా ప్రకటించింది.
ఇదీ చదవండి:పాక్పై 1971 విజయానికి 50 ఏళ్లు.. నేవీ ప్రత్యేక వీడియో