ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యాచట్టం సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం - జూన్ 1 నుంచి విద్యాకానుక న్యూస్

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నాలుగోరోజు కొనసాగుతున్నాయి. విద్యా చట్టం సవరణ బిల్లుకు సభలో సభ్యులు ఆమోదం తెలిపారు. పేద, బడుగు వర్గాల పిల్లలకు ఆంగ్ల మాధ్యమం అందించేందుకు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ సవరణ బిల్లు తీసుకొచ్చామని సీఎం జగన్ తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియంలో తప్పనిసరిగా విద్యాబోధన జరగేలా ఈ బిల్లును రూపొందించారు. జూన్‌ 1 నుంచి జగనన్న విద్యా కానుక పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

education act bill passed in ap assembly
education act bill passed in ap assembly

By

Published : Jan 23, 2020, 2:10 PM IST

విద్యాచట్టం సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం

ఏపీ విద్యా చట్టం సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. మండలిలో ప్రతిపాదించిన సవరణలు శాసనసభలో వీగిపోయాయి. అంతకు ముందు ఆంగ్ల మాధ్యమంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి మాట్లాడారు. పోటీ ప్రపంచంలో పేదవారు సైతం నెగ్గాలంటే ఇంగ్లిష్‌ మీడియం అవసరమన్నారు. పేద విద్యార్థుల కోసమే రైట్‌ టు ఇంగ్లిష్‌ విధానం తీసుకొచ్చామన్నారు. విద్యా కానుక పథకం కింద రూ.1350ల విలువైన కిట్‌ను విద్యార్థులకు అందిస్తామన్నారు. జూన్‌ 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని తెలిపారు.

ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు

ఇంగ్లిష్‌ మీడియం బిల్లును కౌన్సిల్‌లో అడ్డుకున్నారని.. పేదవారికి మేలు చేసే బిల్లును ఎందుకు అడ్డుకుంటున్నారో అర్ధం కావడం లేదన్నారు సీఎం. సవరణలు చేస్తూ అసెంబ్లీకి తిప్పి పంపారు. మళ్లీ ఇక్కడ ఆ బిల్లును ఆమోదిస్తున్నాం. ఇప్పుడు మళ్లీ మండలికి పంపుతాం. అసెంబ్లీలో ఆమోదం పొందితే మండలిలో అడ్డుకోవడానికి ఏమీ ఉండదని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details