పరువుకు భంగం కలిగించే వార్తలు రాస్తే మీడియాపై కేసులు నమోదు చేయవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 2430 తీసుకురావడంపై... ఎడిటర్స్ గిల్డ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ జీవో సెన్సార్షిప్ కిందికే వస్తుందని అభిప్రాయపడింది. తక్షణం జీవోను ఉపసంహరించుకోవాలని ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది. గిల్డ్ అధ్యక్షుడు శేఖర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఏకే భట్టాచార్య, కోశాధికారి షీలా భట్... ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రతి శాఖకు నేతృత్వం వహిస్తున్న ఉన్నతాధికారులకు కట్టబెట్టిన అపరిమిత అధికారాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని... ఇది పత్రికా స్వాతంత్య్రానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.
జీవో 2430తో పత్రికా స్వేచ్ఛకు ఆటంకం: ఎడిటర్స్ గిల్డ్ - ఎడిటర్ గిల్డ్ న్యూస్
నిరాధార వార్తలు రాస్తే ప్రచార, ప్రసార మాధ్యమాలపై కేసులు నమోదుచేయవచ్చంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 2430ను ఎడిటర్స్ గిల్డ్ తప్పుబట్టింది. జీవో సెన్సార్ షిప్ కిందకే వస్తుందని అభిప్రాయపడింది. పత్రికా స్వాతంత్య్రానికి భంగం కలిగించేలా ఉన్న ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
![జీవో 2430తో పత్రికా స్వేచ్ఛకు ఆటంకం: ఎడిటర్స్ గిల్డ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5003092-262-5003092-1573227125498.jpg)
జీవో 2430తో పత్రికా స్వేచ్ఛకు ఆటంకం : ఎడిటర్స్ గిల్డ్