ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రుణ యాప్‌ల వ్యవహరంపై కేసు నమోదు చేసిన ఈడీ - తెలంగాణ వార్తలు

ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ రుణ యాప్​ల వ్యవహారంలో కేసు నమోదు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్​, రాచకొండ కమిషనరేట్లలో నమోదైన కేసుల ఆధారంగా విచారణ ప్రారంభించింది.

runa yaplu
రుణ యాప్‌ల వ్యవహరంలో కేసు నమోదు చేసిన ఈడీ

By

Published : Feb 20, 2021, 3:14 PM IST

రుణ యాప్‌ల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్ డైరెక్టరేట్‌ కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లలో నమోదైన కేసుల ఆధారంగా విచారణ చేపట్టింది. ఇప్పటికే యాప్‌ల నిర్వాహకులు 30 వేల కోట్లు చైనాకు తరలించినట్లు గుర్తించారు. మనీ లాండరింగ్‌తో పాటు హవాలా ద్వారా డబ్బులు తరలించినట్టు గుర్తించారు.

నలుగురు చైనా దేశస్థులతో పాటు 36 మందిని అరెస్టు చేశారు. మరో నలుగురు చైనీయులు పరారీలో ఉన్నారు. కీలక సూత్రధాని జెన్నీఫర్‌ కోసం లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. హంకాంగ్‌లో జెన్నీఫర్‌ తలదాచుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రోజర్‌ పే, పేటీఎం సంస్థల గేట్‌వే ద్వారా నిధులు బదలాయించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. రుణ యాప్‌ల వెనుక చైనా సంస్థల పాత్రను ఈడీ వెలికితీయనుంది.

ఇదీ చూడండి:ఎస్​ఈసీ నిమ్మగడ్డతో తెలంగాణ మాజీ ఎస్​ఈసీ భేటీ

ABOUT THE AUTHOR

...view details