ED Notices To Telangana Congress Leaders: నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్‌కు, పార్టీ అనుబంధ సంస్థలకు విరాళమిచ్చిన కొందరికి నోటీసులు ఇచ్చింది. ఈడీ నోటీసులు అందుకున్న వారిని అధిష్ఠానం దిల్లీకి రమ్మని తెలిపింది. నిన్ననే కొందరు కాంగ్రెస్ నాయకులు దిల్లీ చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం దిల్లీలో కాంగ్రెస్ నేతలు, ఆడిటర్లతో సమావేశం నిర్వహించనున్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు - National Herald case ED to Telangana Congress
ED Notices To Telangana Congress Leaders: నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్‌ను విచారించిన ఈడీ పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చింది.
ఈడీ నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఈడీ సోనియా, రాహుల్‌ను విచారించింది. కేసులో భాగంగా విరాళమిచ్చిన పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చిన క్రమంలో.. కేసు పూర్వాపరాల గురించి కాంగ్రెస్ అధిష్ఠానం నోటీసులు అందుకున్న వారికి వివరాలు తెలియచేయనుంది. ఇప్పటికే షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డి, గీతారెడ్డి, రేణుకాచౌదరి, అంజన్‌కుమార్ యాదవ్, గాలి అనిల్‌కుమార్ దిల్లీ వెళ్లినట్లు సమాచారం.
ఇవీ చదవండి: