ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల్లో నేడు ఈడీ కేసులపై విచారణ జరగనుంది. నాంపల్లి కోర్టు నుంచి ఇటీవల బదిలీ అయిన అరబిందో, హెటిరోలకు భూకేటాయింపుల ఛార్జ్ షీట్ పై ఇవాళ విచారణ ప్రక్రియ ప్రారంభం కానుంది. జగన్, విజయ్ సాయిరెడ్డితో పాటు నిందితులుగా ఉన్న అరబిందో ప్రతినిధులు రాంప్రసాద్ రెడ్డి, నిత్యా నందరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, ప్రసాద్ రెడ్డి, రాజేశ్వరి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, తదితరులు ఇవాళ హాజరు కావాలని ఇటీవల న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.
జగతి పబ్లికేషన్స్, ఇందూ టెక్ జోన్, రాంకీ, పెన్నా, భారతీ సిమెంట్స్ అంశాలపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లపై కూడా నేడు విచారణ జరగనుంది. మొదట ఈసీ కేసులు ప్రారంభించవద్దని..సీబీఐ కేసులు మొదట విచారణ జరపాలని.. లేదా రెండు సమాంతరంగా చేపట్టాలని జగన్ సహా కేసుల్లోని నిందితులు వాదించారు. ఇవాళ న్యాయస్థానం నిర్ణయం వెల్లడించనుంది.