ఓటుకు నోటు కేసులో(vote for note case) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది. ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బిషప్ సెబాస్టియన్, రుద్ర ఉదయ్ సింహా, మత్తయ్య జెరూసలేం, వేం కృష్ణ కీర్తన్ను నిందితులుగా పేర్కొంది. 2015 జూన్ 1న జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా(tdp) అభ్యర్థిగా పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు కుట్ర జరిగినట్లు ఈడీ వెల్లడించింది.
తెలంగాణ అవినీతి నిరోధక సంస్థ దాఖలు చేసిన ఛార్జిషీట్(charge sheet) ఆధారంగా మనీలాండరింగ్(money laundering) నిరోధక చట్టం ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. రేవంత్ రెడ్డి(revanth reddy), ఉదయ్ సింహా, సెబాస్టియన్, వేం నరేందర్ రెడ్డి తదితరులను ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేసిన.. పలు ఆధారాలతో గురువారం నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో అభియోగపత్రం సమర్పించింది.