ED attaches in ESI Scam: ఈఎస్ఐ ఔషధాల కుంభకోణంలో మనీలాండరింగ్ చట్టం కింద రూ.144 కోట్లను ఈడీ అటాచ్ చేసింది. ఐదుగురు నిందితులు.. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మజ, ఫార్మసిస్టు కె.నాగమణి, కాంట్రాక్టర్లు కె.శ్రీహరిబాబు, పి.రాజేశ్వరరెడ్డి ఆస్తులను అటాచ్ చేసింది. తెలంగాణ, ఏపీ, బెంగళూరు, నోయిడాల్లోని.. మొత్తం 131 స్థిరాస్తులను అటాచ్ చేసింది. ఇందులో 97 ప్లాట్లు, 6 విల్లాలు, 18 కమర్షియల్ దుకాణాలు, 4 ప్లాట్లు, 6 వ్యవసాయ స్థలాలున్నాయి. పలు సెక్యూరిటీ డిపాజిట్లు, ఎఫ్‌డీలనూ అటాచ్ చేసింది. అనిశా కేసుల ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ED attaches in ESI Scam: ఈఎస్ఐ ఔషధాల కుంభకోణంలో రూ.144 కోట్లు అటాచ్ - esi hyderabad scam
ఈఎస్‌ఐ ఔషధాల కుంభకోణంలో మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మజ, ఫార్మసిస్టు కె.నాగమణి, కాంట్రాక్టర్లు కె.శ్రీహరిబాబు, పి.రాజేశ్వరరెడ్డి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
ED attached Rs 144 crore in ESI drug scam