తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారాన్ని నిలిపివేయాలని.. కేంద్ర ఎన్నికల సంఘం భాజపాను ఆదేశించింది. సాలు దొర.. సెలవు దొర.. ప్రచారంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి బొమ్మతోపాటు ఈ నినాదాన్ని కలిపి పోస్టర్లుగా ముద్రించడానికి అనుమతి నిరాకరించింది. సాలు దొర.. సెలవు దొర.. ప్రచారానికి అనుమతి కోరుతూ భారతీయ జనతా పార్టీ నేతలు ఎలక్షన్ కమిషన్ను సంప్రదించారు. ఈ దరఖాస్తును.. మీడియా సర్టిఫికేషన్ కమిటీ తిరస్కరించింది.
భాజపాకు షాక్.. సీఎం వ్యతిరేక ప్రచారంపై ఈసీ అభ్యంతరం - సీఎం కేసీఆర్పై భాజపా ప్రచారానికి ఈసీ బ్రేక్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా.. చేపట్టిన ప్రచారాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భాజపాను ఆదేశించింది. సాలు దొర సెలవు దొర పేరిట సాగించే ప్రచారంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కించపరిచే విధంగా పోస్టర్లు, ఫొటోలు, రాతలు ఉండకూడదని కమిషన్ తేల్చిచెప్పింది. 2019 ఎన్నికలకు ముందు సుప్రీంకోర్టు ఆదేశాలతో మీడియా సర్టిఫికేషన్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పార్టీలు చేసే ప్రచారానికి సంబందించిన అన్ని విషయాలపై సర్టిఫికేషన్ కమిటీ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఒకవేళ దీన్ని ధిక్కరిస్తే.. కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఇవి చదవండి: YS VIJAYAMMA: వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం.. హైదరాబాద్ వెళ్తుండగా ఘటన
టమాటా రైతుల బాధ ప్రభుత్వానికి పట్టదా