ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ - ఏపీలో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ న్యూస్

మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ.. రాజీనామ చేయడంతో ఖాళీ అయిన శాసనమండలి స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈమేరకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ
ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ

By

Published : Aug 6, 2020, 5:56 PM IST

మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన... ఎమ్మెల్సీ స్థానానికి.. నామినేషన్ దాఖలుకు ఆగస్టు 13 తేదీని తుదిగడువుగా పేర్కొంటూ.. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 24 తేదీన పోలింగ్ ఉంటుందని నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. ఈ ఏడాది జులై 1వ తేదీన శాసనమండలి సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. 2023 మార్చి వరకూ ఆయన పదవీ కాలం ఉన్నప్పటికీ ముందస్తుగా రాజీనామా చేయటంతో ఈ ఖాళీ ఏర్పడినట్టు ఎన్నికల సంఘం నోటిఫికేషన్​లో పేర్కొంది. ఆగస్టు 26 తేదీలోపు ఉపఎన్నికల ప్రక్రియను ముగించాల్సిందిగా ఈసీ నోటిఫికేషన్​లో స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details