అమరావతిలో వింతశబ్దంతో కంపించిన భూమి - అమరావతిలో వింతశబ్దంతో కంపించిన భూమి
06:20 February 27
భయంతో పరుగులు తీసిన జనం
రాజధాని అమరావతి ప్రాంతంలో వింత శబ్దంతో భూమి కంపించింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల్లో ఈ ఉదయం 5 గంటల 30 నిమిషాలకు భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. తెల్లవారుజామున ఒక సెకను పాటు భారీ శబ్దం వచ్చిందని తుళ్లూరు గ్రామస్తులు తెలిపారు. ఈ శబ్దానికి తలుపులు కిటికీలు కొట్టుకున్నాయని చెప్పారు. ఒక్కసారిగా భయాందోళనకు గురై ప్రజలు బయటకు పరుగులు తీశారు. తాడికొండ మండలం బడేపురం, తుళ్లూరు మండలం బోరుపాలెంలో ప్రకంపనలు వచ్చాయని గ్రామస్తులు తెలిపారు.
ఇదీ చదవండి:
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపుపై కేంద్ర జలశక్తిశాఖ అధ్యయనం