నేడు తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు ప్రకటించనున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు జేఎన్టీయూహెచ్లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను విడుదల చేస్తారు. ఈ నెల 9 నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఎంసెట్ ప్రవేశాల కమిటీ కౌన్సెలింగ్ షెడ్యూలును ఖరారు చేసింది. ధ్రువపత్రాల పరిశీలన కోసం ఈనెల 9 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ రుసుము చెల్లించి.. సహాయ కేంద్రం ఎంచుకోవాలి. ఈనెల 12 నుంచి 18 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 12 నుంచి 20 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. ఈ నెల 22న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లు కేటాయిస్తామని ప్రవేశాల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. 22 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో బోధన రుసుము చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు.
29న చివరి విడత