ఏపీ ఎంసెట్ దరఖాస్తులను ఈ నెల 26వ తేదీ నుంచి స్వీకరించనున్నారు. 20న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. తాడేపల్లిలో సోమవారం ఛైర్మన్ హేమచంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఎంసెట్ కమిటీ సమావేశంలో నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన ప్రాథమిక షెడ్యూల్‌పై నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తులను ఆన్లైన్లోనే స్వీకరించనున్నారు. విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు. కాకినాడ జేఎన్టీయూ పరీక్షలు నిర్వహించనుంది. ఎంసెట్ కన్వీనర్‌గా వి. రవీంద్ర వ్యవహరించనున్నారు. ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ, బీఎస్సీ వ్యవసాయం, ఉద్యాన, పశుసంవర్ధక (బీవీఎస్సీ), మత్స్య (బీఎఫ్ఎస్సీ), బీఫార్మసీ, ఫార్మా-డీ కోర్సులు కోసం ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంసెట్ ఫలితాలను ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం మే 5న విడుదల చేస్తారు.
ఈ నెల 26 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ - eamcet application latest updates
ఈ నెల 26వ తేదీ నుంచి ఎంసెట్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఎంసెట్ కమిటీ నిర్ణయించింది. దరఖాస్తులను ఆన్లైన్లోనే స్వీకరించనున్నట్లు తెలిపారు. కాకినాడ జేఎన్టీయూ ఈ పరీక్షలు నిర్వహించనుంది.
![ఈ నెల 26 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ eamcet online application starts on 26th march](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6029928-707-6029928-1581386795806.jpg)
ఈ నెల 26 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ