ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TS Engineering Counseling: ఈనెల 30 నుంచి తెలంగాణలో ఎంసెట్ కౌన్సెలింగ్

By

Published : Aug 10, 2021, 6:51 PM IST

తెలంగాణలో ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 30న ప్రారంభం కానుంది. ఈనెల 30 నుంచి సెప్టెంబరు 9 వరకు ఆన్​లైన్​లో కౌన్సెలింగ్ రుసుము చెల్లించి, ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్​కు అవకాశం కల్పించారు.

ts Engineering Counseling
ఈనెల 30న ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

తెలంగాణలో ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశాల మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 30న ప్రారంభం కానుంది. ఈనెల 30 నుంచి సెప్టెంబరు 9 వరకు ఆన్​లైన్​లో కౌన్సెలింగ్ రుసుము చెల్లించి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. సెప్టెంబరు 4 నుంచి 11 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. సెప్టెంబరు 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది.

సెప్టెంబరు 15న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు. సెప్టెంబరు 15 నుంచి 20 వరకు ఆన్ లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తదితర ప్రవేశాల కమిటీ సభ్యులు సమావేశమై షెడ్యూలు ఖరారు చేశారు. రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూలు తర్వాత వెల్లడిస్తామని నవీన్ మిత్తల్ తెలిపారు.

పాలిటెక్నిక్ చదివిన అభ్యర్థులు ఇంజినీరింగ్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈనెల 24 నుంచి ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రవేశాల కమిటీ సమావేశంలో షెడ్యూలు ఖరారు చేశారు. ఈనెల 24 నుంచి 28 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఈనెల 26 నుంచి 29 వరకు ఈసెట్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఈనెల 26 నుంచి 31 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి.

సెప్టెంబరు 2న ఈసెట్ అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబరు 2 నుంచి 7 వరకు ఆన్ లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెప్టెంబరు 13న ఈసెట్ తుది విడత ప్రవేశాల షెడ్యూలు ప్రారంభం కానుంది. సెప్టెంబరు 14న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. సెప్టెంబరు 14, 15 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. సెప్టెంబరు 17న తుది విడత ఈసెట్ సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 18 నుంచి 20 వరకు విద్యార్థులు కాలేజీల్లో చేరాలని ప్రవేశాల కమిటీ ఛైర్మన్, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. సెప్టెంబరు 18న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details