BAR LICENSE: రాష్ట్రవ్యాప్తంగా బార్ల లైసెన్సింగ్ బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జోన్-1, జోన్-4లలో బిడ్లను అధికారులు తెరిచారు. రాయలసీమలో భారీ మొత్తాలకు బిడ్లు దాఖలయ్యాయి. రాయలసీమ జిల్లాల్లో మెజార్టీ బార్లకు రీ-బిడ్డింగ్ జరుగుతోంది. నేటినుంచి మూడేళ్లపాటు ఈ బార్లు కొనసాగనున్నాయి. ఇప్పటివరకు నమోదైన బార్ల వేలం వివరాలు..
VISAKHA: విశాఖ మహానగరంలో 128 బార్లకు దరఖాస్తులకు ఆహ్వనించగా.. 120 బార్లకు అప్లికేషన్లు వచ్చాయి. దరఖాస్తులు వచ్చిన వాటిలో 119 బార్ లైసెన్స్‌లకు ఎక్సైజ్‌శాఖ పచ్చజెండా ఊపింది. కాకపోతే విశాఖలో గరిష్ఠంగా రూ.60 లక్షల ధర మాత్రమే పలికింది.
KURNOOL:జిల్లా వ్యాప్తంగా 27 బార్లకు లైసెన్స్ కోసం ఆన్ లైన్ లో ఈ వేలం నిర్వహించగా.. కేవలం 36 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. కర్నూలులో 18 బార్లకు 23 మంది అప్లై చేసుకొగా.. ఆదోనిలో 5 బార్లకు 6 మంది.. ఎమ్మిగనూరులో 3 బార్లకు 5 మంది.. గూడూరులో ఒక్క బారుకు కేవలం ఇద్దరు మాత్రమే అప్లై చేసుకున్నారు. వీరులో లైసెన్స్ కు చెల్లించాల్సిన డబ్బుకు సరిపడా కోడ్ చేసిన వారిని ఎంపిక చేశారు.