ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Jagananna Gorumudda : ఇక.. ‘జగనన్న గోరుముద్ద’లు తినిపించే బాధ్యత వారిదేనట! - ఆంధ్రప్రదేశ్ వార్తలు

రాష్ట్రంలోని పాఠశాలల్లో అమలు చేస్తున్న "జగనన్న గోరుముద్ద" పథకం బాధ్యతలను ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు అప్పగించింది. గ్రామ సమాఖ్య(వీవో) లీడర్లు, యానిమేటర్లు, సీసీలు, ఆఫీస్‌ బేరర్లు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఈ సంఘాలు పర్యవేక్షించాల్సి ఉంది.

Jagananna Gorumudda
ఇకపై ‘జగనన్న గోరుముద్ద’ తనిఖీ బాధ్యతలు డ్వాక్రా సంఘాలదే..

By

Published : Nov 13, 2021, 8:49 AM IST

రాష్ట్రంలోని పాఠశాలల్లో అమలు చేస్తున్న "జగనన్న గోరుముద్ద" పథకం బాధ్యతలను ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు అప్పగించింది. గ్రామ సమాఖ్య(వీవో) లీడర్లు, యానిమేటర్లు, సీసీలు, ఆఫీస్‌ బేరర్లు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఈ సంఘాలు పర్యవేక్షించాల్సి ఉంది.

పాఠశాలల్లో అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద పథకం సక్రమంగా అమలవుతోందా? అనే తనిఖీలు నిర్వహించే బాధ్యతను ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు అప్పగించింది. గ్రామ సమాఖ్య(వీవో) లీడర్లు, యానిమేటర్లు, సీసీలు, ఆఫీస్‌ బేరర్లు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఈ సంఘాలు పర్యవేక్షించాలి.

వీరు తమ పరిధిలోని ఏదో ఒక పాఠశాలను సందర్శించి.. జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో.. బియ్యం, కందిపప్పు, వేరుసెనగ చిక్కి, గుడ్లు పంపిణీ చేస్తున్నారా?, వాటి పరిమాణం, నాణ్యత ఎలా ఉన్నాయి? అనేది పరిశీలించాల్సి ఉంది. ఆ వివరాలను ఐఎంఎంఎస్‌ యాప్‌లో చిత్రాలతో సహా నమోదు చేయాలని జిల్లాలకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇదీ చదవండి : Central Loans for States : రాష్ట్రానికి ఆ రుణాలు లేనట్లేనా..??

ABOUT THE AUTHOR

...view details