ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Dussehra holidays in telangana దసరా సెలవుల తగ్గింపు.. - ఎస్‌సీఈఆర్టీ విద్యాశాఖకు సూచన

Dussehra holidays in telangana తెలంగాణలో పాఠశాలలకు ఇప్పటికే ఖరారు చేసిన దసరా సెలవుల్ని తగ్గించాలని ఎస్‌సీఈఆర్‌టీ ప్రతిపాదించినట్టు వార్తలు వస్తున్నాయి. దసరాకు 14 రోజులకు బదులుగా తొమ్మిది రోజులే సెలవులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖకు సూచించినట్టు తెలుస్తోంది.

dussehra holidays in telangana
దసరా సెలవుల తగ్గింపు

By

Published : Sep 21, 2022, 12:38 PM IST

Dussehra holidays in telangana దసరా పండుగ సందర్భంగా విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 14 రోజులు సెలవులు ప్రకటించారు. ఈసారి విద్యార్థులకు బాగానే సెలవులు దొరకనున్నాయి అనుకునే లోపే మరో వార్త చక్కర్లు కొడుతోంది. దసరాకు 14 రోజులకు బదులుగా తొమ్మిది రోజులే సెలవులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖకు ఎస్‌సీఈఆర్‌టీ (రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి) సూచించినట్టు తెలుస్తోంది.

జూలైలో వర్షాలు, సెప్టెంబర్‌ 17న పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఏడు రోజులు పనిదినాలు తగ్గాయని, దీంతో ఆ సెలవు దినాలను భర్తీ చేసేందుకు ఎస్‌సీఈఆర్‌టీ మరో ప్రతిపాదన పాఠశాల విద్యాశాఖ ముందు ఉంచింది. నవంబరు నుంచి ఏప్రిల్ వరకు రెండో శనివారాలు కూడా పాఠశాలలు పనిచేయాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో దసరా సెలవులు ఈనెల 26 నుంచి కాకుండా.. అక్టోబర్ 1నుంచి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఎస్‌సీఈఆర్‌టీ ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించిన సెలవులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 9వరకు దసరా సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details